నిజామాబాద్ నార్త్: నిజామాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల పెంపునకు వైద్యశాఖ చర్యలు
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నెలకు 2,000 ప్రసవాలు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ప్రతి గురువారం హైరిస్క్ డేగా పాటించాలని నిర్ణయించారు.