నిజామాబాద్ నార్త్: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: రూ.5 లక్షల వరకు భరోసా
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల మధ్య ఉన్న కుటుంబ సంపాదనాపరులు తమ వివరాలను స్థానిక ప్రత్యేక నమోదు కేంద్రాల్లో సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.