రాయదుర్గం: పట్టణంలో పోలీసు స్టేషన్, కోర్టు ప్రాంగణంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
రాయదుర్గం పట్టణంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు స్టేషన్ ఆవరణ త్రివర్ణ బెలూన్లు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సిఐ వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిఐ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలతో స్వాతంత్ర్యం సిద్ధించిందని, రాజ్యాంగం ప్రకారం అందరూ నడచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.