రాయదుర్గం: కణేకల్లు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి
కణేకల్లు క్రాస్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లంపల్లి గ్రామానికి చెందిన దొణతిమ్మప్ప మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు కణేకల్లు వైపు నుంచి స్వగ్రామానికి బైక్ పై వస్తున్న అతను రోడ్డుఫై వెళుతున్న గేదెను డీ కొని కిందపడిపోయిడు. అదే సమయంలో రాయదుర్గం నుండి ఐచర్ వాహనం వచ్చి మీద వెళ్లడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే దొణతిమ్మప్ప మృతి చెందడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు.