యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో శిక్షణ పొందిన యువతకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించేందుకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. విజయవంతంగా పూర్తి చేసుకున్న యువతకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షణ బాబు పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.