రామచంద్రాపురం: బీరంగూడ కమాన్ వద్ద ఘోర ప్రమాదం: బోల్తా పడిన ప్రైవేట్ బస్సు
సంగారెడ్డి జిల్లా బీరంగూడ కమాన్ వద్ద ప్రైవేట్ బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సల్మాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.