కరకగూడెం: మాచినేనిపేట తండాలో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే డబ్బులు అడుగుతున్నారు: జ్యోతి ఆవేదన
జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాకు చెందిన జ్యోతి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇల్లు రావాలంటే కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు అడుగుతున్నారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము ఆ డబ్బు చెల్లించలేకపోతున్నామని ఆమె ఆరోపించారు.