కనిగిరి: కార్తీక పౌర్ణమి సందర్భంగా భైరవకోనకు తరలివచ్చిన నాగ సాధువులు, అఘోరాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసిన భక్తులు
చంద్రశేఖరపురం: ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం భైరవకోన శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయానికి పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు బుధవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతంలో స్థానమాచరించిన భక్తులు త్రిముఖ దుర్గాదేవి, శ్రీ భైరవేశ్వర స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా రుద్రాభిషేక కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నాగ సాధువులు, అఘోరాలు తరలివచ్చి శివునికి అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.