*మృతదేహం కనిపించినా స్పందించలేదా..?*
*అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం!*
*దళితులమని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ*
వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాల ఆచూకీ కోసం అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం దోర్నాల–మార్కాపురం ప్రధాన రహదారిపై బంధువులు ధర్నా నిర్వహించి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వినయ్ మృతదేహం ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు కనిపించినప్పటికీ, వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారని బంధువులు ఆరోపించారు. మృతదేహాలు కొట్టుకుపోయి రోజులు గడుస్తున్నా గాలింపు చర్యలు వేగవంతం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము దళితులం కావడం వల్లే తమ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారి మృతదేహాల ఆచూకీ కనిపెట్