రాయదుర్గం: కణేకల్లు రోడ్డులో రేకులు జారి రోడ్డుపై పడంతో ఒక్కసారిగా కలకలం
రాయదుర్గం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో గురువారం అశోక్ లేల్యాండ్ లగేజీ వాహనం నుంచి రేకులు జారిపడంతో ఓ మహిళకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. 20 అడుగుల రేకులు టాప్‌పై వేసుకుని వెళుతున్న వాహనం స్పీడ్ బ్రేకర్ గమనించక బ్రేకులు వేయడంతో రేకులు ముందుకు జారి రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో రోడ్డుఫై వెళుతున్న మహిళ పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. నడి రోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు వాహనం ముందు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.