తౌషిక్ తల్లి మౌలాబి మృతిపై తీవ్ర ఆవేదన..
ఒక తల్లి న్యాయం కోసం చేసిన పోరాటం ఇలా ముగియడం బాధాకరం..
సింగరాయకొండలో విద్యార్థి సయ్యద్ తౌషిక్ మృతి ఘటనపై న్యాయం కోసం నెలల తరబడి పోరాడిన ఆయన తల్లి మౌలాబి గారు కూడా మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసింది.
తన కుమారుడి మృతికి న్యాయం జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక తల్లి ఇంతకాలం పోరాటం చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం అత్యంత బాధాకరం.
ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నాను.
🔹 తౌషిక్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.
🔹 మౌలాబి గారి మృతికి దారితీసిన పరిస్థితులపై నిజానిజాలు వెలుగులోకి తేవాలి.
🔹 బాధిత కుటుంబానికి న్యాయం, అండగా ప్రభుత్వం నిలవాలి.
🔹 బాధ్యులు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
#JusticeForToushiq
#JusticeForMoulabi
#Singarayakonda
#JusticeForMinorities