🚨 **గణేష్ కమిటీ సభ్యులతో ఎస్ఐ సమావేశం**
**తర్లుపాడు:** మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో *ఎస్ఐ బసవరాజు* సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల సూచనలు, గణేష్ ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సూచించారు.