గూడూరు: ఇతర పార్టీ వారు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడం సంతోషంగా ఉంది : గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
చిట్టమూరులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.