గూడూర్: గుండెంగా గ్రామంలో బావిలో శవమై తేలిన 2 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి
గత రెండు రోజుల కింద అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలో చోటుచేసుకుంది. గుండెంగ గ్రామానికి చెందిన తేజావత్ భద్రు (40) మంగళవారం సాయంత్రం అదృశ్యమయ్యాడని,గూడూరు పోలీస్ స్టేషన్ లో భార్య తేజావత్ నీల ఫిర్యాదు చేసింది. బుధవారం సాయంత్రం నుంచి పోలీసులు వెతుకుతుండగా గురువారం ఉదయం గుండెంగ గ్రామంలోని వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.