గూడూర్: పట్టణంలో విద్యుదాఘాతంతో డెకరేషన్ అండ్ టెంట్ హౌస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, 10 లక్షల ఆస్తి నష్టం
ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో డెకరేషన్ అండ్ టెంట్ హౌస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువైన వస్తువులు అగ్నిలో కాలి బూడిద అయ్యాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గూడూరు మండల కేంద్రానికి చెందిన మెరుగు భరత్ గౌడ్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌజ్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. దీంతో అందులో ఉన్న ఎల్‌ఈడీ లైటింగ్ వైర్లు, సర్వీసు వైర్లు, సౌండ్ సిస్టం తదితర ఎలక్ర్టికల్ సామాన్లు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు 10 లక్షల మేర సామాగ్రి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.