గూడూర్: విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు: గూడూరులో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్ జిల్లా,గూడూరు మండలం ఆశ్రమ బాలుర, బాలికల పాటశాలను, మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాన్ని,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారంగా భోజనం రుచికరంగా అందించాలని, విద్య బోధిస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, పడక గదులు, పరిసరాలు, స్టోర్ రూం, వంటగదులను అదనపు కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. పౌష్టికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సూచించారు. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.