కనిగిరి: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని గుదేవారిపాలెం నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టిన వైసిపి నాయకులు
పెద్ద చెర్లోపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటూ పెదచెర్లోపల్లి మండలం గుదేవారి పాలెం కు చెందిన వైసిపి నాయకులు మండలంలోని పాలేటి గంగమ్మ తల్లి ఆలయం వద్ద నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని నారాయణ యాదవ్ అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని వైసిపి నాయకులు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.