గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో ఘనంగా మహిళా దినోత్సవం, కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చీతీరాల కళ్యాణ మండపంలో ఆదివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం మహిళ సోదరీగా చల్లిగా తల్లిగా భార్యగా సృష్టిని కాపాడుకుంటూ వస్తుందని వారి ప్రాముఖ్యత ప్రస్తుతం ఎంతో పెరిగిందని అన్నారు. అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి చెందుతున్నారని భవిష్యత్తు అలానే రానున్న రోజుల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మహిళలను కొనియాడారు. అనంతరం పలువురు మహిళలు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని సన్మానించారు.