కొండపి: పొన్నలూరు మండలంలోని కోటపాడులో పొగాకు బ్యారన్ దగ్ధం
పొన్నలూరు మండలంలోని కోటపాడులో పొగాకు బ్యారన్ కాలిపోయిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పొగాకు బ్యారన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. మంటలు అధికంగా రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.