కొండపి: రాష్టంలో గృహ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి స్వామి
కనిగిరిలో బుధవారం సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గృహ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకోవడానికి ఎస్సీ, బీసీలకు రూ.3 లక్షలు, ఎస్టీలకు రూ.3 లక్షల 25 వేలు కూటమి ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు స్థలం ఇస్తున్నట్లు తెలిపారు.