కొండపి: హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది: మంత్రి స్వామి
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి లో మంగళవారం అధికారులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచి క్రమం తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.