కొండపి: పొన్నలూరు మండలంలో ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు
పొన్నలూరు మండలంలో మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో విప్పగుంట జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 93 మంది, పొన్నలూరు జడ్పీ హైస్కూల్లో 160 మంది, జూనియర్ కళాశాలలో 116 మంది మొత్తం 369 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఎంఈఓ రవిచంద్రబాబు తెలిపారు.