సంతనూతలపాడు: సంతనూతలపాడు లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన దళిత సంఘాలు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో గురువారం పాస్టర్ పగడాల మృతిపై సంతాపం తెలుపుతూ దళిత సంఘాలతో పాటు పాస్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతి చెందడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. పోలీసులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.