కనిగిరి: గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకొని రైతుల ధర్నా
కనిగిరి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రం వద్ద గురువారం రైతులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కనిగిరి- పొదిలి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, తక్షణం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలు స్తంభించుకోవడంతో ఎస్ఐ శ్రీరామ్ సంఘటన స్థలానికి చేరుకొని, రైతులతో మాట్లాడి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.