కనిగిరి: కుటుంబ సాధికార కమిటీ సభ్యులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: టిడిపి నియమించిన కుటుంబ సాధికార కమిటీ సభ్యులు తమకు కేటాయించిన 60 ఇళ్లలో ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో, ఎవరికి అందడం లేదు అడిగి తెలుసుకుని అర్హులందరికీ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సూచించారు. కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువారం కుటుంబ సాధికార కమిటీ సభ్యులు, టిడిపి కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన జన రంజకంగా సాగిందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు ఇచ్చారని, నేడు తల్లికి వందనం అమలు చేస్తున్నారని అన్నారు.