కనిగిరి: ఈ జూన్ మాసం నుండే సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారం: మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి: ఈ జూన్ మాసం నుండి రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్ కు సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జూన్ 12న పాఠశాలలు తిరిగి పునః ప్రారంభమయ్యే సమయానికి సంక్షేమ హాస్టల్స్ కు సన్నబియ్యాన్ని సరఫరా చేశామన్నారు. సన్న బియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని హాస్టల్స్ లో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరితోపాటు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కోసం కూడా సన్నబియ్యాన్ని వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.