కనిగిరి: బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.... బడి ఈడు పిల్లలందరినీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించిందన్నారు. పేదలు విద్యకు దూరం కాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుంది అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.