కనిగిరి: పట్టణంలోని బొగ్గుల గొంది కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు #localissue
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గులగొంది కాలనీలో కనీస మౌలిక వస్తులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి సౌకర్యానికి నోచుకోకపోవడంతో, బబుల్స్ నీరు కొనుగోలు చేసి తాగవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండకు ఆనుకొని కాలనీ ఉండడంతోపాటు చిల్ల చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో పాములు ఇళ్లలోకి, పాముల సంచారంతో పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని అంటున్నారు. డ్రైనేజీ కాలువలు లేక మురుగునీరు ఇళ్ల మధ్య నిలిచి, దోమల వ్యాప్తి వల్ల సేజనల్ వ్యాధులు ప్రబలుతాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.