మార్కాపురం: చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించిన క్లస్టర్ కోఆర్డినేటర్ రవి శేఖర్ రెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపిఎన్జిసి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రక్షాబంధన్ సందర్భంగా వినూత్నంగా నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్లస్టర్ కోఆర్డినేటర్ రవి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విత్తన రాఖీలను తయారుచేసి వృక్షాలకు మొక్కలకు కట్టించారు. పాఠశాలలో దాదాపు 200 పైగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లుగా అయన తెలిపారు