మోటకొండూరు: తేర్యాల గ్రామంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా మోటకొండూర్ మండలం తేర్యాల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, చట్టాలపై అవగాహన గురించి న్యాయవాది నాగరాజు గ్రామస్తులకు వివరించారు. న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.