మోటకొండూరు: ముత్తిరెడ్డిగూడెం - కాటేపల్లి మధ్య ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి - మోత్కూరు ప్రధాన రహదారి మోట కొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం - కాటేపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడగా ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల పద్మగా స్థానికులు గుర్తించారు .మరింత సమాచారం తెలియాల్సి ఉంది.