మోటకొండూరు: కాటేపల్లి వద్ద కారు బైక్ ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి, భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండలం, కాటేపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాటేపల్లి వద్ద కారు బైకు ఢీకొనగా బైకుపై వెళ్తున్న వస్తువుల స్వామి (38) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి మృతి పై కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ, భార్యనే చంపించి ఉంటుందని ఆరోపిస్తున్నారు. మురికిడి స్వగ్రామం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామం కాగా మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.