మోటకొండూరు: కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం: అశోక్ గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా, మోట కొండూరు మండల పరిధిలోని కాటేపల్లి గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం జరిగ ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. కంపెనీకి విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.