మోటకొండూరు: మోటకొండూరు మండల అభివృద్ధి కొరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
మోట కొండూరు మండల కేంద్రంలో అన్ని పార్టీ ముఖ్య నాయకులతో ప్రభుత్వ వి ప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మూట కొండూరు మండల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో అధికారులు సర్వే చేసి రిపోర్టు అందజేయాలని, దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేయడం జరుగుతుందని తద్వారా ప్రజలకు పాలనా సజావుగా కొనసాగుతుందని అన్నారు.