మోటకొండూరు: మోట కొండూరు గురుకుల పాఠశాల నుండి CEC గ్రూపులో తరలిస్తే ఉద్యమాలు తప్పవు: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్
యాదాద్రి భువనగిరి జిల్లా, మోట కొండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో CEC గ్రూపును తరలించవద్దని కోరుతూ గురువారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్ మాట్లాడుతూ.. కావాలనే గురుకుల పాఠశాల నుండి CEC గ్రూపులు తరలిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తరలించవద్దని కోరారు. పాఠశాల నుండి CEC గ్రూపును తరలిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.