నాగిల్ గిద్ద: ఇరక్పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం: బయటపడ్డ నిర్వాహకుల బాగోతం
నాగల్గిద్ద మండలం ఇరక్పల్లిలో పర్యావరణం పేరుతో రియల్టర్లు ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఒక్క చెట్టు కూడా లేని వెంచర్లో వసతులు లేకుండా ప్లాట్లు అమ్ముతూ, రిజిస్ట్రేషన్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.