ఉరవకొండ: అరవకూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో చిన్న కౌకుంట్ల వాసి అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని అరవకూరు సమీపంలో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిన్నకౌకుంట్ల వాసిఅక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు చిన్న కౌకుంట్ల గ్రామానికి చెందిన వడ్డే కృష్ణ(36)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.