సంతనూతలపాడు: మర్రి చెట్ల పాలెం లో బూదవాడకు వెళ్ళు రహదారిలో పైప్లైన్లు దెబ్బతిని నీటి లీకేజీల వల్ల గుంతలతో, మురగమయంగా మారిన రహదారి
చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం లో బూదవాడకు వెళ్ళు రహదారి లో నీటి పైప్లైన్లు దెబ్బతిని పగిలిపోయాయి. నీటి పైప్లైన్లు పగిలిపోయి రహదారిపైకి నీరు వచ్చి చేరుతూ ఉండడంతో రహదారి గుంతలతో బురదమయంగా తయారైంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి దెబ్బతిన్న నీటి పైప్లైన్లకు మరమ్మత్తులు చేపట్టి, నీటి లీకేజీలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.