కనిగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
పామూరు మండలంలోని వగ్గం పల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అభివృద్ధి మరియు సంక్షేమంపై కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. గడచిన రెండేళ్లలో కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశానని, రానున్న మూడేళ్లలో మరింతగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా అర్హులుగా ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.