అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం బెలుగుప్ప గ్రామాల్లో పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మరమ్మత్తు చేసిన భవనాలను గురువారం ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయా గ్రామాల్లో జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏఈ శ్రీనివాస్ రెడ్డి, మండల పిఆర్ జేఈ పరుశురాం తో కలసి సిసి రోడ్లతోపాటు బెలుగుప్ప పాత పిహెచ్సి భవనాన్ని 32 లక్షలతో మరమ్మత్తు పనులను అధికారులు పరిశీలించారు. పరిశీలన నివేదికలను జిల్లా అధికారులకు అందజేస్తామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు.