రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ నుంచి కందుకూరు వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్కే యూనివర్సిటీ వద్ద నుంచి కందుకూరు గ్రామం వరకు 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో టిడిపి రూరల్ మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ టిడిపి నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ, మురళీమోహన్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతోనే 60 లక్షల రూపాయలతో కందుకూరు నుంచి ఎస్కే యూనివర్సిటీ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని ఒక నెల రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ మురళీమోహన్ పేర్కొన్నారు.