రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ ఎంపిక చేసిన రాప్తాడు కురుబ సంఘం నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం నేతలు సమావేశం నిర్వహించి రాప్తాడు నియోజకవర్గం కురువ సంఘం ఉపాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ ఎంపిక చేయడం జరిగిందని భవిష్యత్తులో కురుబ కులస్తుల సమస్యలపై కురుబ సంఘం నిరంతరం పోరాటం చేసేందుకు కూడా ముందుంటామని ఈ సందర్భంగా కురుబ సంఘం రాప్తాడు అధ్యక్షుడు మురళి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు.