మార్కాపురం పోలీస్ స్టేషన్ వద్ద అన్నా రాంబాబు దర్నా మార్కాపురం వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సలీంను వెంటనే విడుదల చేయాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ఏ కారణంతో స్టేషన్కు తీసుకొచ్చారో అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. #markapur