**దీపావళి సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం**
**తర్లుపాడు:** దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
దాతల సహాయ సహకారాలతో ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.