*కౌంటింగ్ హాల్లో ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వాగ్వాదం*
మార్కాపురం మార్కెట్ యార్డులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్‌కు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్ హాల్లో త్రిపురాంతకం సీఐ మాతంగి శ్రీనివాసులు ఎందుకు ఉన్నారని, బ్యాలెట్ బాక్సుల వద్ద సీఐకి ఏం పని అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. తాను ప్రజాప్రతినిధినని, చిన్నపిల్లవాడిని కాదంటూ స్థానిక డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు.