కొండపి: మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన 14 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరిక, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన 14 కుటుంబాలు మంత్రి స్వామి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం మంత్రి స్వామి కార్యాలయంలో ఆదివారం వారు కండవాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే టీడీపీలో చేరుతున్నట్ల పేర్కొన్నారు.