కనిగిరి: క్రీడలు శారీరక వికాసానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి: కనిగిరి సీఎం ఖాజావలి
కనిగిరి పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో జరుగుతున్న మున్సిపల్ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో కనిగిరి ఖాజావలి టీం విజేతగా నిలిచి, కప్ సాధించింది. ఈ సందర్భంగా సిఐ ఖాజావలి మాట్లాడుతూ.... క్రీడలు శారీరక వికాసానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో ఓడినా, గెలిచినా క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సిఐ అన్నారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన సీఐ టీమ్ కు కాస్మోపాలిటన్ నిర్వాహకులు అభినందించారు.