కనిగిరి: పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం రుచి చూసిన మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలోని తీగల గొంది లో ఉన్న అన్న క్యాంటీన్ ను కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో అల్పాహారాన్ని స్వయంగా రుచిచూసిన మున్సిపల్ చైర్మన్ ... అల్పాహారం నాణ్యతగా ఉందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం నాణ్యతగా ఉంటుందని, అయితే క్యాంటీన్లో పని చేస్తున్న సిబ్బంది ప్రవర్తన బాగాలేదని స్థానికులు మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అన్న క్యాంటీన్ కు వచ్చే పేదల పట్ల ప్రేమతో మెలగాలని, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించవద్దని సిబ్బందిని చైర్మన్ ఆదేశించారు