కనిగిరి: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5వేలు జరిమానా: హనుమంతునిపాడు ఎస్ఐ మాధవరావు
హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు రహదారిలో ఎస్ఐ కే మాధవరావు శనివారం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై వెళ్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని వాహనదారులను హెచ్చరించారు. అదేవిధంగా కారు నరిపేవారు సీటు బెల్ట్ ధరించకుంటే రూ. 1000 లు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించుకుంటే రూ. 1000 లు జరిమానా విధిస్తామన్నారు.