కనిగిరి: పట్టణంలో రహదారులకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను పోలీసులతో కలిసి కూల్చివేసిన పంచాయతీ అధికారులు
పామూరు పట్టణంలోని రహదారులకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను పంచాయితీ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి కూలిచివేశారు. పట్టణంలోని రహదారులు, డ్రైనేజీ కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను పూర్తిగా శనివారం వారు తొలగించారు. పామూరు పట్టణంలో రహదారులకు ఇరువైపులా అక్రమ కట్టడాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని, ఎవ్వరూ కూడా ఆక్రమణల కు పాల్పడవద్దని పామూరు సిఐ భీమానాయక్ సూచించారు.